సి.ఆర్.ఆర్.కళాశాలల అధినేత సి.ఆర్.రెడ్డి 145వ జయంతి వేడుకలు
1 min readఘనంగా నివాళులర్పించిన ప్రిన్సిపల్,పలువురు శాస్త్రవేత్తలు, అధ్యాపకులు,విద్యార్థులు
పల్లెవెలుగు, ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లాలో ఎంతో మంది ఐ ఏ ఎస్ ,ఐ పీ ఎస్, ఐ ఎఫ్ ఎస్,ఐ ఆర్ ఎస్ లో తో బాటు డాక్టర్ లను,ఇంజనీర్ లను,వ్యవసాయ,శాస్త్ర సాంకేతిక విద్యా వేత్త లను అదేవిధంగా గా ఈ కళాశాలలో చదివిన విద్యార్దుల ను ఇదే కాలేజి కి అధ్యాపకులగాను,అంతరిక్ష వ్యోమోగాము ల గా ను చివరకు ప్రజలకు సుపరి పాలన అందించే రాజకీయ నాయకులను,కవులను కళాకారులను తీర్చి దిద్ది ఈ సమాజానికి అందించి దేశ విదేశాలలో పశ్చిమ గోదావరి జిల్లా కీర్తినిసర్’సి ఆర్ రెడ్డి అటానమస్ కళాశాల ప్రతిష్టలను చాటి చెప్పిన మహోన్నత మైన విద్యా వేత్త సర్ సి.ఆర్.రెడ్డి 145వ జయంతిని సర్ సి ఆర్ రెడ్డి కళాశాలలో మంగళ వారంభ్కలా శాల యాజమాన్యం ఘనం గా నిర్వ హించింది.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా: కె.ఏ.రామరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయ మొదటి ఉపకులపతిగాబ్పని చేస్తూ ఈ ప్రాంతానికి అందించి ఈ కళాశాల స్థాపనకు బీజం వేసిన మహోన్నత మైన వ్యక్తి సర్ కట్టమంచి రామలింగారెడ్డి సేవలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల కరస్పాండెంట్ డా:కె.ఎస్.విష్ణుమోహన్ సర్ సి.ఆర్.రెడ్డి విగ్రహానికి పూల మాలను వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ సర్ సి.ఆర్.రెడ్డి అనుమతితో ఏలూరులో డిగ్రీ కళాశాల ప్రారంభించామని, వారిమీద గౌరవముతోనే సర్ సి.ఆర్.రెడ్డి విద్యాసంస్థలన్నిటికీ వారి పేరునే కొనసాగించడం జరుగుతుందని ఈ నాటి నవ విద్యార్థి విద్యార్దులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్-ప్రిన్సిపాల్ కె. విశ్వేశ్వరరావు, పి.జి. కోర్సెస్ డైరెక్టర్ డా:వి.ఆర్.ఎస్.బాబు యలమర్తి, ఇంటర్మీడియెట్ కోర్సెస్ ప్రిన్సిపాల్ ఎన్. శ్రీనివాసరావు, ఐక్యుఏసి కో-ఆర్డినేటర్ డా:జి.రాము, బోధనేతర సిబ్బంది జి. శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.