దివ్యాంగులకు టిటిడి దేవస్థానం దర్శనం పాత పద్దతి కొనసాగించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా వికలాంగుల ఉద్యోగుల సంఘం, కర్నూలు జిల్లా వారు వ్రాసుకున్న విన్నపము ఏమనగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానము దర్శనమునకు దివ్యాంగులు చాలా దూరమవుతున్నారు. కారణము ఎమనగా ఈ ఆన్లైన్ దర్శనము పెట్టినప్పటి నుండి దివ్యాంగులకు దర్శనము అందని ద్రాక్షగా వుంది. ఎందు కంటే సామాన్య దివ్యాంగులు ఆన్లైన్ చేసుకోవడం కుదరడం లేదు. ఎందుకంటే మారుమూల గ్రామలలో దివ్యాంగులు ఆన్లైన్ చేసుకొవడం కష్టసాధ్యం. అందుకుగాను పాత పద్దతి ప్రకారము (దివ్యాంగుల సర్టిఫికెట్ చూపించి నేరుగా దర్శనం చేసుకొనుట) అనుమతించ వలసినదిగా వేడుకొనుచున్నాము.ఏదైతే దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానము నందు దివ్యాంగులకు రావలసిన 5% ఉద్యోగ రిజర్వేషన్ వెంటనే అమలు చేయవలసినదిగా మనవి. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వికలాంగుల ఉద్యోగ సంఘాల జనరల్ సెక్రటరీ కే కృష్ణుడు , వివి గిరి అంబన్న అన్న, హనుమంతప్ప అలాగే విభిన్న ప్రతిభావంతుల యువసేన అసోసియేషన్ అధ్యక్షులు బోయ రామాంజనేయులు జనరల్ సెక్రటరీ మనోహర్ భాస్కర్ మస్తాన్వలి జ్ఞానేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందుకుగాను మీ యొక్క సమస్యలను తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్లో తప్పకుండా బోర్డులో మీ సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది అందుకుగాను ఆయనకు మా అందరి దివ్యాంగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.