రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరుకు చిరు సత్కారం….
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల కార్తిక వనభోజనoను ఈ నెల 17.11.2024 నాడు అల్లంపూర్ లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి సన్నిధిలో కర్నూల్ డివిజన్ వారి ఆతిథ్యంతో, ఏ.పీ.ఆర్.ఎస్.ఏ., కర్నూలు జిల్లా పక్షాన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు మన ప్రియతమ జిల్లా కలెక్టర్ అయినా శ్రీ పి.రంజిత్ భాష IAS అలాగే జాయింట్ కలెక్టర్ శ్రీమతి బి. నవ్య IAS రెవిన్యూ ఉద్యోగుల కార్తీక వనభోజన కార్యక్రమానికి ఏ.పీ.ఆర్.ఎస్.ఏ., కర్నూలు జిల్లా వారు కోరిన వెంటనే అనుమతిని మంజూరు చేసి ఉన్నారు. అందువలన రెవెన్యూ ఉద్యోగుల కార్తీక వనభోజనంను విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రియతమ జిల్లా కలెక్టర్ అయినా శ్రీ పి. రంజిత్ భాషా IAS ని అలాగే జాయింట్ కలెక్టర్ శ్రీమతి బి.నవ్య IAS ని మర్యాదపూర్వకంగా కలిసి చిరుసత్కారం చేయడం జరిగింది. అలాగే వీరితోపాటు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి సి. వెంకటనారాయణమ్మ ని అలాగే పరిపాలన అధికారి శ్రీమతి పి.విజయశ్రీ ని, అలాగే జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీ ఎం.రాజా రఘువీర్, కర్నూలు వారిని అలాగే రెవెన్యూ విభాగపు అధికారి కర్నూలు వారు అయిన శ్రీ కె. సందీప్ కుమార్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి చిరు సత్కారం చేయడమైనది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గం నుండి అధ్యక్షుడు సి.నాగరాజు, సెక్రెటరీ ఎం.లక్ష్మీరాజు, ట్రెజరర్ శ్రీ ఐ. వేణుగోపాల్, స్పోర్ట్స్ సెక్రటరీ సి.వెంకటేశ్వర రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి లోకేశ్వరి మరియు కర్నూల్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ రామాంజనేయులు వారి కార్యదర్శి వేణుగోపాలరావు, ట్రెజరర్ శ్రీమతి సహరభాను అలాగే వార కార్యవర్గ సభ్యులైన శ్రీమతి సహన ఇతర కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లు అధ్యక్షుడు సి. నాగరాజు, కార్యదర్శి ఎం. లక్ష్మిరాజు, ఏ.పీ.ఆర్.ఎస్.ఏ., కర్నూలు జిల్లా