రాజకీయాలు కాదు..అభివృద్ధే నా ఆలోచన
1 min readపాలిటెక్నిక్ కాలేజీ మంజూరు కొరకై మంత్రి దృష్టికి
గ్రామాల అభివృద్దే నా బాధ్యత
మండల సమావేశంలో ఎమ్మెల్యే జయసూర్య..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత రాజకీయాల వైపు కాదు నా ఆలోచన..గ్రామాల అభివృద్ధి వైపే నా ఆలోచన ఉందని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. శనివారం నందికొట్కూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మురళీ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ఎమ్మెల్యే జయసూర్య హాజరయ్యారు.ముందుగా వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివారు. గ్రామాల్లో సమస్యల గురించి ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తీసుకువచ్చారు.తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ఏమి కావాలన్నా సరే నా దృష్టికి తీసుకువస్తే గ్రామాల అభివృద్ధికి నా బాధ్యత అని 2019-24 మధ్య పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి వెళ్లాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో సిమెంట్ రోడ్లు పనులు జరుగుతున్నాయని ఈ పనులు పూర్తి అయిన వెంటనే బిల్లులు వస్తాయన్నారు.గత ఐదేళ్లలో ఆర్డబ్ల్యూఎస్ పనుల బిల్లుల మంజూరు గురించి నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు.అందరి సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలు అసంపూర్తిగా మిగిలిపోయిన వాటిని త్వరలో పూర్తి చేస్తామని పెన్షన్ దారులు ఒకేసారి మూడు నెలల పింఛన్ తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని నందికొట్కూరు పట్టణంలో 60 వేల జనాభా ఉన్నా మోడల్ పాఠశాల, కస్తూర్బా పాఠశాల లేవని పట్టణానికి పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. బిజినవేముల గ్రామంలో స్మశాన వాటిక స్థలం మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ రవి యాదవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం శర్మ,తహసిల్దార్ బి శ్రీనివాసులు,సీడీపీఓ కోటేశ్వరమ్మ,ఈవోఆర్డీ రంగనాయక్,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాథ్,ఏపీఎం శ్రీనివాసులు,ఏపీఓ మంగమ్మ,అంగన్వాడీ సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.