సంబరాలలో బిజెపి నాయకులు …
1 min readమిఠాయిలు పంచిపెట్టిన మండల అధ్యక్షుడు గాడి భాస్కర్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మహారాష్ట్రలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిజెపి పార్టీ భారీ మెజార్టీతో గెలవడంతో శని వారం మండల కేంద్రమైన చెన్నూరు కొత్త రోడ్డులో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు బిజెపి జండాలు పట్టుకొని హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూభారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో వరుసుగా మూడోసారి భారీ విజయం సాధించినందున విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గాడి భాస్కర్, రాష్ట్ర సీనియర్ నాయకులు మాదినేని రామసుబ్బయ్య, రెడ్డి ప్రసాద్, సరోజమ్మ,అతికారి రవి, రాజేశ్వర్ రెడ్డి, శివరాం, రమేష్, శ్రీనివాసులు రాజు,వెంకటరమణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.