వరి పంట దెబ్బతిన్న రైతులను వెంటనే ఆదుకోవాలి
1 min readబిజెపి నాయకులు మాదినేని రామసుబ్బయ్య. గాడి భాస్కర్ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండలంలో వివిధ గ్రామాల్లో రైతులు సాగుచేసిన వరి పంట అకాల వర్షాలు కారణంగా పంట దెబ్బతిన్నదని వెంటనే రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాదినేని రామసుబ్బయ్య మండల అధ్యక్షుడు గాడి భాస్కర్ డిమాండ్ శుక్రవారం చెన్నూరు మండలం చిన్న మాస పల్లి గ్రామంలో రైతులు సాగు చేసి నోరు ఫీడ్ చేసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. బిజెపి నాయకులు భాస్కర్ఆధ్వర్యంలో వరి పంట నష్టాన్ని మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి కి వివరించడం జరిగింది.అకాల వర్షాలతో చుట్టుపక్కల గ్రామాలలో సుమారు 800 ఎకరాలలో వరి పంట నష్టం జరిగిందని వారు తెలిపారు.రైతులు.కౌలు రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు తగిన నష్టపరిహారాన్ని అందించాలని బీజేపీ సీనియర్ నాయకులు మాదినేని రామసుబ్బయ్య, గాడి భాస్కర్, రైతులు పుత్త నాగమణి రెడ్డి, లేబాకు, జగన్, బూసి వెంకటసుబ్బయ్య, నిత్య పూజ, రైతులు కౌలు రైతులు వ్యవసాయ అధికారికి వివరించడం జరిగింది.