చేతికొచ్చిన పొగాకు పంట ధ్వంసం..
1 min readబాధితులపైనే కర్రలు రాడ్లతో దాడి..
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న బాధితులు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): లక్షల రూపాయలు ఖర్చు చేసి పొగాకు పంటను ధ్వంసం ధ్వంసం చేశారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందిన బాపనపల్లె సోమరాజు కుమారుడు బి జయరాజుకు గుడిపాడు గ్రామ పొలిమేరలో ఉన్న 565/బి లో 2 ఎకరాల 25 సెంట్ల పొలాన్ని బి ఆరోగ్యం భార్య సంజమ్మ అనే మహిళ 2010 లో పొలాన్ని అమ్మారు.పొలం అమ్మినట్లు సంజమ్మ అగ్రిమెంట్ కూడా రాసి చ్చారు.తర్వాత రిజిస్టర్ చేయించమని జయరాజు, సోమరాజు సంజమ్మను అడుగుతుండగా రిజిస్టర్ చేయించడం లేదు.అగ్రిమెంట్ రాయించిన రోజునే పొలం కొన్న నగదును సంజమ్మకు మరియు ఆమె భర్త ఆరోగ్యం కు నగదును జయరాజు ఇచ్చారు.గత 14 సంవత్సరాలుగా ఆ పొలంలో జయరాజు పంటలు వేసుకుంటూ ఉన్నారు.ఈ సంవత్సరం వేసుకున్న పొగాకు పంటను సంజమ్మ మరియు ఈమె కుమారులు విజయరాజు,ఆనంద్,సంజీవ రాయుడు తదితరులు కలసి ఏపీ 21 సిడి 5751 మరియు ఏపీ 39 జిఎస్ 8351 అను రెండు కార్లు వీటితో పాటుగా ట్రాక్టర్ రోటో వేటర్ తో మరి కొంతమంది గురువారం రాత్రి 7:30 కు పొలంలో వేసిన పొగాకు పంటను ట్రాక్టర్ రోటో వేటర్ ద్వారా చేతికొచ్చిన పంటను ధ్వంసం చేశారు. గ్రామస్తులు జయరాజుకు సమాచారం ఇవ్వగా వెంటనే జయరాజు,సోమరాజు వీరిద్దరూ పొలం దగ్గరికి వెళ్లగా వారు తెచ్చుకున్న కర్రలు రాడ్లు తీసుకొని పొలం దగ్గరికి వస్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించడంతో మమ్మల్ని ఎక్కడ చంపుతారోనని భయపడి పొలాల్లో దాకున్నామని జయరాజు సోమరాజు పాత్రికేయులకు తెలిపారు.పంటను ధ్వంసం చేసిన వారు ప్రస్తుతం ఆళ్లగడ్డ రుద్రవరం మండలం రెడ్డివారి పల్లె గ్రామంలో నివాసం ఉంటున్నారు.అక్కడ నుండి ట్రాక్టర్ మరియు కార్లను తీసుకొని అంతేకాకుండా కార్లలో కర్రలు రాడ్లు కత్తులు తీసుకొని వచ్చారని పొలం దగ్గర మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారని బాధితులు ఆరోపించారు.సంజమ్మ ఆరోగ్య శాఖలో హెల్త్ అసిస్టెంట్ గా పని చేస్తున్నట్లు బాధితులు తెలిపారు.చేతికొచ్చిన పంటను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం కు బాధితులు వివరించారు.