గొడవలకు అడ్డాగా మారిన గ్లోబల్ జీనియస్ కాలేజీని సీజ్ చేయాలి
1 min readరాత్రి 7 గంటల వరకు క్లాసులు నిర్వహించడం దారుణం
ఫీజుల వసూల్లే తప్ప మౌలిక వసతులు కల్పించని యాజమాన్యం
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలోనే తహసిల్దార్ కార్యాలయంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిప్యూటీ తాహసిల్దార్ వీరభద్ర గౌడ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు కృష్ణ రఘు ఖాజా ఆఫ్రిదీ రవి మాట్లాడుతూ పట్టణంలో గాంధీ నగర్ లో ఉన్నటువంటి గ్లోబల్ జీనియస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు యాజమాన్యం పర్యవేక్షణ క్రమశిక్షణ లేక గొడవలతో సతమతం అవుతూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారని యాజమాన్యం ఇవేమీ పట్టనట్లు చూసి చూడనట్లు వ్యవహరించి ఫీజులు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తూ క్లాసులు మాత్రం రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని అలాగే విద్యార్థులకు ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా కనీసం సైకిళ్లు ఆపడానికి పార్కింగ్ ప్లేస్ లేక గ్రౌండ్ లేక అలాగే ల్యాబ్స్ కూడా సరిగా లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు అర్హత లేని లెక్చరర్స్ తో బోధన చేయిస్తున్న సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటనే వారు వాపోయారు ఇకనైనా అధికారులు స్పందించి యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వీరేంద్ర రవి తదితరులు పాల్గొన్నారు.