సైబర్ నేరాల పై అవగాహన కల్పించేందుకు కరపత్రాలు ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: కర్నూలు జిల్లా ఎస్సి బిందు మాధవ్ సూచనల మేరకు సైబర్ నేరాలు, మోసాల గురించి ప్రజలను అప్రమత్తము చేసి, వారికి అవగాహన కల్పించేందుకు కరపత్రాలను హోళగుంద పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ బాలా నరసింహులు ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమమునకు హోలగుంద జెడ్పి హై స్కూల్ , కన్నడ స్కూల్, తనూజ డిగ్రీ కాలేజ్, సుమౌర్య డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు, పోలీసు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరాలు జరిగే విధానం గురించి అవగాహన కలిగి ఉండాలని, అపరిచితుల నుండి వచ్చే వీడియో కాల్స్ కానీ, .apk లింకులకు కానీ రిసీవ్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎవరికి కూడా మన వ్యక్తిగత వివరాలు బ్యాంకు సంబంధించిన వివరాలు చెప్పకూడదని తెలియజేయడమైనది. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 నంబరు, పోలీస్ వారికి కాల్ చేసి తగిన సహాయం పొందాలని తెలియజేయడమైనది? ఈ కార్యక్రమంలో ఎస్సై బాల నరసింహులు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
,