కూటమి నాయకులు మాటపై నిలవాలి..
1 min readసమగ్ర సర్వే చేసి ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడాలి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు, వాగులు, చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన మాట పై నిలిచి సమగ్ర సర్వే చేసి ప్రభుత్వ భూములను, వాగులను,చెరువులను కబ్జాల నుండి కాపాడాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి,న్యాయవాది చంద్రశేఖర్, ఎం నాగరాజు ,షేక్ అన్వర్ భాష ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఉదయం పి పి ఎస్ ఎస్ ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో పలు కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు బి తాండ్రపాడు చెరువు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిపారుదల శాఖ భూములను గుర్తించి కాపాడాలని కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూకబ్జాలపై స్పందిస్తున్నట్లుగానే కర్నూలు చుట్టూ జరిగిన భూకబ్జాలపై కూడా కూటమి ప్రభుత్వంలోని పాలకులు స్వద్దించాలని కోరారు. బి తాండ్రపాడు చెరువు, ప్రభుత్వ భూములు వాగులు మొత్తం కలిపి దాదాపు 100 ఎకరాల వరకు ఉన్నట్లు తెలిసింది అన్నారు. ప్రభుత్వ భూములు చెరువుల కబ్జాల గురించి కొందరు అధికారులు వాస్తవాలను ప్రజలకు తెలియకుండా దాస్తున్నారని విమర్శించారు.ప్రభుత్వ భూములు, చెరువులు వాగులు కబ్జాలకు గురై పర్యావరణం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు.కబ్జాలను అరికట్టి రాబోయే తరానికి చెరువులు ప్రభుత్వ భూములు ఉపయోగపడేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో సభ్యులతో పాటు వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు కే శ్రీనివాసులు, సివి వర్మ,ఎన్ మదిలేటి, ఎండి యూనుస్, ఎన్ పీటర్,బి వన్నూరు సాహెబ్, బి నాగేంద్ర,ఎన్ విజయ్ కుమార్, సి మధు తదితరులు పాల్గొన్నారు.