అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలి
1 min read
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ప్రపంచ మేధావి అపర జ్ఞాని, రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి పై సాక్షాత్తు పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేంద్ర హోమ్ మినిస్టర్ అమీర్ చట్టసభల్లో అంబేద్కర్ను అవమానం పరిచినందుకు దానికి నిరసనగా పత్తికొండ పట్టణంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్లో కేంద్ర హోమ్ మినిస్టర్ అమీర్షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు జర్నలిస్తులు రాముడు, రవి కుమార్ మండిపడ్డారు. అలాగే అదే పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే దళిత జాతి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి అంబేద్కర్ ఆశయసాధన కొరకు ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో అన్ని వర్గాలతో ప్రజలతో ఏకం చేసి ఐక్య ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు రమణ, దళిత సమైక్య సంఘం నాయకులు శ్రీనివాసులు, థామస్, జయన్న, విద్యార్థి సంఘం నాయకులు మధుబాబు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.