PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిమోనియాపై  అవగాహన కార్యక్రమం …

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు పట్టణంలో UPHC ఇందిరమ్మ హౌసెస్ పరిధిలోని 93 సచివాలయం (రాజీవ్ కాలనీ) నందు న్యుమోనియా పై  అవగాహన కార్యక్రమం నిర్వహిండమైనది. ఈ సందర్భంగా DEMO శ్రీనివాసులు   మాట్లాడుతూ  ప్రభుత్వ అదేశాలమేరకు 12.11.24 నుండి 28.02.2025 తేది వరకు “ప్రతీ శ్వాస ముఖ్యమైనది – న్యుమోనియా ను నివారిద్దాం” అను నినాదం తో తల్లులకు న్యుమోనియా పై  అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా శీతాకాలం నందు చిన్నపిల్లలు న్యుమోనియా బారిన పడే అవకాసం ఉన్నదని తల్లులు తమపిల్లలు  దగ్గు,జలుబు, వేగంగా శ్వాస తీసుకోవడం, డొక్కలు ఎగురవేయడం , జ్వరం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే సమీప ఆరోగ్య కేంద్రం నందు చికిత్స చేయించాలని తెలిపారు. న్యుమోనియా నుండి పిల్లలను కాపాడుకొనుటకు పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టించడం , 6 నెలలవరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడం , పిల్లల శరీరాన్ని పూర్తిగా బట్టలతో కప్పిఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.     తదుపరి వారు మాట్లాడుతూ  గర్భవతులకు, 5సంII  లోపు పిల్లలకు ఇవ్వవలసిన టీకాలను క్రమం తప్పక ఇప్పించాలని దీనివలన తల్లులను మరియు  పిల్లలను వ్యాదుల బారినుండి కాపాడ వచ్చునని తెలిపారు.   ఈ కార్యక్రమం లో Dy DEMO చంద్రశేఖర్ రెడ్డి  , ఆరోగ్య కార్యకర్త  సత్యకల ,  ఆశా కార్యకర్త లు జాకీర బేగం , తబిత పాల్గొన్నారు.  

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *