సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలి…
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రాలయం తహశీల్దారు రవి, సిఐ రామాంజులు, ఆదోని ఆర్టిఓ దీప్తి లు సూచించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంత్రాలయం లో ఎస్సై పరమేష్ నాయక్ అధ్వర్యంలో సైబర్ నేరాలు, రక్షణ పై రాఘవేంద్ర సర్కిల్ లో, మాధవరం ఎస్సై విజయ కుమార్ ఆధ్వర్యంలో మాధవరం లో అవగాహన కల్పించారు. బస్సులు, ఆటోలకు సైబర్ నేరాల కరపత్రాలు అంటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఆధునిక సైబర్ నేరాల పట్ల అవగాహన ఎంతో అవసరం అన్నారు. డిజిటల్, కోరియర్ ఫెడెక్స్, ఆన్ లైన్ తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తి గత వివరాలు అపరిచిత వ్యక్తులకు ఇవ్వకూడదన్నారు. తెలియని లింకుల పట్ల ఆచితూచి అడుగులు వేయాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో లు చూడకూడదన్నారు. లోన్ ఇస్తామని మోసపూరిత మాటలు నమ్మవదన్నారు. మీకు డబ్బులు వచ్చాయని మీ ఓటిటి చెప్పమని అడిగితే చెప్పరాదన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.