PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నవంబరు 14వ తేది నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD) 3.0 సర్వేలో భాగంగా నవంబరు 14వ తేది క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం జరుగుతుందని,  తద్వారా ముందుగానే క్యాన్సర్ ను గుర్తించి నివారించుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 క్యాన్సర్ స్క్రీనింగ్ కు సంబంధించిన “క్యాన్సర్ ను నివారించవచ్చు” పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవంబరు 14వ తేది నుంచి రాష్ట్రంలో మరియు జిల్లాలో నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వే మరియు చిల్డ్రన్ సర్వే కూడా చేయడం జరుగుతుందన్నారు. క్యాన్సర్ పరీక్షల్లో భాగంగా  సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్లను పరీక్షించడం జరుగుతుందని, అందుకు అవసరమైన కిట్స్ జిల్లాకు రావడం జరిగిందని, వాటిని పిహెచ్సీ లకు పంపుతున్నామన్నారు.. నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ 3.0 సర్వే లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎఎన్ఎం, సిహెచ్ఓ, ఆశ అదే అర్బన్ లో ఎఎన్ఎం, ఆశ ఇంటింటికీ వెళ్లి సర్వే చేయడం జరుగుతుందన్నారు. ఈ సర్వే ద్వారా 18సం.లు పై బడిన వారందరినీ పరీక్షించడం జరుగుతుందన్నారు. ఆర్బిఎస్కే చిల్డ్రన్ స్క్రీనింగ్ (రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం) ద్వారా 6 నెలల నుంచి 18 సం.ల విద్యార్థుల వరకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ పంపడం జరిగిందన్నారు..  పిల్లలు అందరూ స్క్రీనింగ్ పాఠశాలకు/అంగన్వాడీ కేంద్రానికి హాజరు అయ్యేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లల్లో ఏమైనా సమస్యలు గుర్తిస్తే వారిని డిఐసిలకు (డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెంటిన్ సెంటర్లకు) (ఆదోని, జిజిహెచ్ కర్నూలు)లకు  రెఫర్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, డిఎం హెచ్ఓ డా.ఎల్.భాస్కర్, ఆర్బిఎస్కె కోఆర్డినేటర్ హేమలత, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author