సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎస్పీ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. శుక్రవారం స్థానిక నాలుగు స్తంభాల దగ్గర స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పౌరులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పి అన్నారు. అనుమానం ఉన్న గ్రూపులో తాము చేరవద్దని తెలిపారు. పొరపాటున సైబర్ నేరాలకు గురైనట్లయితే మొదటి గంట లోపల 1930 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. కావున సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. క్రైమ్ నేరాలపై అవగాహన పెంచేందుకు స్థానిక పోలీసులు ప్రజలకు కరపత్రాలు పంచారు. అలాగే ఆర్టీసీ బస్సులకు, ఆటోలకు స్టిక్కర్ లను అంటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ జయన్న, ఎస్ఐలు గోపాల్, వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ శివాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.