చెక్ బౌన్స్ కేసు కొట్టివేత…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంత్రాలయం గ్రామానికి చెందిన ముదునూరి అశోక్ వర్మ అనే వ్యక్తి, మాధవరం గ్రామానికి చెందిన కమ్మరి విజయ్ కుమార్ అనే వ్యక్తి మీద వేసిన రూ 15 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసు ను ఆదోని జిల్లా కోర్టులో కొట్టివేశారు. శనివారం బాధితులు విజయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం 2016 సంవత్సరంలో వేసిన ఈ కేసు ను ఎమ్మిగనూరు కోర్టు విచారించగా 2018 లో విజయ్ కుమార్ కు 6 నెలలు జైలుశిక్ష విధించిందని తెలిపారు. దీని మీద విజయ్ కుమార్ ఆదోని లోని జిల్లా కోర్టు కు అప్పీలు కు వెళ్ళగా జడ్జి పి జే సుధా పూర్తిస్థాయి విచారణ జరిపి ఈనెల 4వ తారీఖున కింది కోర్టు వేసిన శిక్ష ను రద్దు చేస్తూ కేసులో నిజానిజాలు లేవని కేసును పూర్తిగా కొట్టివేయటం జరిగిందని తెలిపారు. ఈ రోజు జడ్జ్మెంట్ కాపీ తీసుకోవడం జరిగిందని తెలిపారు. 8 సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్న నాకు న్యాయం దక్కినందుకు, నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. దేవుని దయ వల్ల ఇటీవల జరిగిన మద్యం టెండర్లలో మండలం లో రెండు మద్యం షాపులు దక్కించుకోవడం జరిగిందని తెలిపారు.