టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి….
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టిడిపి ప్రభుత్వం తోనే సాధ్యం అని స్థానిక టిడిపి నాయకులు అశోక్ రెడ్డి, వరదరాజు లు పేర్కొన్నారు. శుక్రవారం రామచంద్ర నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్లు ను పంచాయతీ శాఖ ఏఈ మల్లయ్య తో పనులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో రూ. 5 లక్షల రూపాయలతో టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాలతో సిసి రోడ్లు ప్రారంభించడం జరిగిందన్నారు. రాఘవేంద్రపురం కాలనీలో, సెల్ టవర్ ఎరియాలో సిసి రోడ్లు వేయడం జరుగుతుందని తెలిపారు. వీరి వెంట ఎంపిటిసి మేకల వెంకటేష్ ,బీమేష్ ,టిడిపి నాయకులు మేకల నర్సింహ తదితరులు ఉన్నారు.