14న సాగునీటి సంఘాల ఎన్నికలు..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోళగుంద పరిధిలోమండలంలోని 3 సాగునీటి సంఘాలకు ఈనెల 14న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ సతీష్ కుమార్, ఇరిగేషన్ ఏఈ ఈశ్వర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పదవులకు ఎన్నికలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం కావాలని తెలియజేశారు. ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లు ఆయకట్టు కింద సాగుదారులై, నీటి పన్ను ఎటువంటి బకాయిలు లేకుండా చెల్లించి ఉండాలని తెలిపారు. వీటితో పాటు మైనర్ ఇరిగేషన్ పరిధిలోని హెబ్బటం చిన్న చెరువు,పెద్ద చెరువులకు సంబంధించి అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఎన్నికల అధికారులు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక్ దళ్, పంచాయతీరాజ్ ఏఈ యమునప్ప, గృహ నిర్మాణ శాఖ ఏఈ గోపీనాథ్ వర్మ, డిప్యూటీ తహసిల్దార్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.