PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జెమ్ కేర్ కామినేని లో విజయవంతమైన లైవ్ హిస్ట్రోస్కోపీ వర్క్ షాప్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక కొత్త బస్టాండ్ నందు గల జెమ్కేర్ కామినేని హాస్పిటల్ లో  FOGSI వాళ్ళ ఆధ్వర్యంలో KOGS మరియు జంకేర్ కామినేని హాస్పిటల్స్ సహాయ సహకారాలతో ఈనెల 10వ తేదీన కర్నూల్ లోనే మొట్టమొదటిసారిగా జాతీయస్థాయి లైవ్ హిస్ట్రోస్కోపి వర్క్ షాప్ నీ నిర్వహించడం జరిగిందని జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ చంద్రశేఖర్  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్ షాప్ లో భారత దేశ నలుమూలల నుంచి ఏడుగురు స్పెషలైజేషన్ చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్లు హాజరై 14 హిస్ట్రోస్కోపీ సంబంధించిన సర్జరీలను ఉచితంగా చేశారని తెలిపారు.సర్జరీలు జంకేర్ కామినేని హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ వి. శృతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు .ఈ సర్జరీలను లైవ్ లో చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 200 మంది గైనకాలజిస్ట్లు , పీజీ చేస్తున్న విద్యార్థులు వచ్చారని వారికి ఆడిటోరియంలో లైవ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా సర్జరీలను చూసే అవకాశాన్ని కల్పించామని చంద్రశేఖర్  తెలిపారు. ఈ కార్యక్రమాని కి ఫాగ్సి సెక్రటరీ డాక్టర్ వి రాధాలక్ష్మి , ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్. వెంకటరమణ సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఇలాంటి లైవ్ సర్జరీలు జరగడం జంకేర్ కామినేని హాస్పిటల్లో ఇది రెండో సారి అని చంద్రశేఖర్  తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్స్ ఎస్ రవిబాబు , డాక్టర్ రామ్మోహన్ , డాక్టర్ బాల మురళీకృష్ణ -లాప్రోస్కోపిక్ సర్జన్ , డాక్టర్ ఆదిత్య -, డాక్టర్ మాధవి -అనస్థీషియా, డాక్టర్ రాఘవేంద్ర -;కార్డియాలజిస్ట్ , డాక్టర్ గణేష్ -చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ,నదీమ్ -ఆపరేషన్ హెడ్ ,డాక్టర్ కీన్ కౌల్  ఏజీఎం, ఆపరేషన్ థియేటర్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించడానికి విచ్చేసిన పీజీ విద్యార్థులు , గైనకాలజిస్టులు సీఈవో డాక్టర్ చంద్రశేఖర్ నీ అభినందించారు.

About Author