PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గురువే.. దైవం..

1 min read

మెడికల్​ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

  • ప్రొఫెసర్లను సన్మానించిన మెడికల్​ విద్యార్థులు

కర్నూలు, పల్లెవెలుగు: భావితరాల భవితను తీర్చిదిద్దగల ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడేనని, అటువంటి వ్యక్తిని పూజిస్తే.. సత్ఫలితాలు సాధించగలరని  మెడికల్​ విద్యార్థులు, వైద్యులు యువతకు సూచించారు. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా  గురువారం ఉపాధ్యాయ దినత్సవాన్ని మెడికల్​ కళాశాలలని కార్డియాలజి విభాగంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్​, కార్డియాలజి విభాగాధిపతి డా. చంద్రశేఖర్​ తో పీజీ విద్యార్థులు కేక్​ కట్​ చేయించారు. అనంతరం డా. చంద్రశేఖర్​ను ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్​ మాట్లాడుతూ  తల్లిదండ్రుల తరువాత విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనన్నారు.  ఉపాధ్యాయుల  సేవలు వెలకట్టలేవని, వారిని ఎప్పుడూ మరవరాదన్నారు.  ఉత్తమంగా చదివి… భావి భారత వైద్యులుగా మారి… పేదలకు వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ సూచించారు.  కార్యక్రమంలో మెడికల్​ కళాశాల పోస్టు గ్రాడ్యుయేట్స్​ సత్ కుమార్​, మహేష్​, నవాజ్​, శ్రీకాంత్​,  అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ప్రశాంత్​ , డా. బిందు, డా. రవి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *