బెంచ్ కాదు “హైకోర్టు కావాలి”
1 min readశ్రీబాగ్ ఒడంబడిక ఉల్లంఘన,రాయలసీమకు తీవ్ర అన్యాయం
సీనియర్ న్యాయవాది, ఆంద్రప్రదేశ్ రైతు సంఘం పత్తికొండ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బి. సురేంద్ర కుమార్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాయలసీమలో హైకోర్టు బెంచ్ కాదని,” హైకోర్టు ఏర్పాటు చేయాలని,” శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని, హైకోర్టు లలో ఏది కావాలో కోరుకునే హక్కు రాయలసీమ ప్రజలకు ఉందని , శ్రీబాగ్ ఒడంబడికను ఉల్లంఘించి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, పత్తికొండ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, ఆంద్రప్రదేశ్ రైతు సంఘం పత్తికొండ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బి. సురేంద్ర కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.శనివారం ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమలో హైకోర్టు బెంచ్ కాదని, హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఇది రాయలసీమ ప్రజల హక్కు అని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆనాడు పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకులు మధ్య ఏర్పడిన అపోహలను,విబేధాలును తొలగించడానికి చేసిన ఒప్పందమే శ్రీబాగ్ ఒడంబడిక అని అన్నారు. 1937 నవంబర్ 16 న జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రాజధాని ఒక చోట ఉంటే ,హైకోర్టు మరొక చోట ఉండాలని ఆ విదంగా సమన్వయం తో ముందుకు పోవాలని, నీటి పారుదల ప్రాజెక్టు ల విషయం లో కూడా రాయలసీమ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ ఒప్పందం ప్రకారం వ్రాసుకున్నారని తెలిపారు.ఐతే రాయలసీమ ప్రజల హక్కులు ను తుంగలో తొక్కి హైకోర్టు ఏర్పాటు చేయవల్సింది పోయి బెంచ్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయడం చాలా విడ్డురంగా ఉందని అన్నారు. ఈ విషయం తెలియక కొంతమంది రాయలసీమకు ద్రోహం తలపెడుతున్న వారి ఫోటోలకు పాలాభిషేకం చేయడం రాయలసీమ ప్రజలు మనోభావాలు దెబ్బతీయడమే అవుతుందని అని ఆయన వాపోయారు. రాయలసీమలో హైకోర్.