అడ్డదిడ్డంగా ఉంటే..వాహనాలు వెళ్లేదెట్లాగా..
1 min readఇబ్బందుల్లో ప్రయాణీకులు వాహనదారులు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో బస్టాండ్ ప్రాంతంలో అనునిత్యం ఎప్పుడూ కూడా రద్దీగా ఉంటుంది ఎందుకంటే విద్యార్థులు పాఠశాలలకు మరియు కళాశాలలకు అంతే కాకుండా మండల కార్యాలయాలకు విపరీతంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు.విద్యార్థుల పుట్టిన తేదీల్లో ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయుట కొరకు వివిధ దూర గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రానికి రావడం తప్పట్లేదు. నందికొట్కూరు నుండి నంద్యాల జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే బస్సులు వాహనాలు ఇటు వైపే వెళ్ళాలి.ఇంకో విషయానికొస్తే పెద్ద పెద్ద ఇసుక టిప్పర్లు, ట్రాక్టర్లు ఆటోలు కార్లు భారీ వాహనాలు ఇటువైపునే వెళ్తూ ఉన్నాయ్..కానీ మండల బస్టాండ్ కేంద్రంలో ఎప్పుడు చూసినా రోడ్డుపైనే వ్యాపార బండ్లు పెట్టడం వాహనాలు అక్కడే అనవసరంగా నిలబెడుతూ ఉండడం వల్ల ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కానీ వాహనాలు నిలబడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఏఎస్ఐ హరిప్రసాద్ రోడ్డుపై నిలబెట్టిన వ్యాపార బండ్లను అక్కడినుండి వేరే చోటికి పంపడంతో వాహనాలు వెళ్లడానికి సులువుగా అయింది.