వినూత్న రీతిలో..నందికొట్కూరు ఎమ్మెల్యే
1 min read-నా దగ్గరికొద్దు..మీ దగ్గరికే వచ్చి సేవ చేస్తా
-గ్రామ గ్రామానికి వెళ్లి ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): మీరు నా దగ్గరికీ ఎవ్వరూ రావద్దు నేనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మీకే అందిస్తానంటూ వారి ఇండ్లకు వెళ్లి నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య చెక్కులను అందజేస్తూ ముందుకు వెళ్తున్నారు.ఏ ఎమ్మెల్యే అయినా సరే తమ కార్యాలయాలకు పిలిపించుకొని చెక్కులను పంపిణీ చేస్తూ ఉంటారు.కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం గ్రామ గ్రామాలకు వెళ్తూ లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడుతున్నారు. బుధవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కాజీపేట, తలముడిపి,రోళ్లపాడు గ్రామాల్లో 7,61,977 రూ.ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మరియు మాండ్ర సురేంద్రనాథరెడ్డి,టీడీపీ మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి పంపిణీ చేశారు.ఉదయం కాజీపేటలో కైపా సీతారామిరెడ్డికి-6,01,977 రూపాయల చెక్కును లబ్ధిదారునికి అందజేశారు. తర్వాత తలముడిపి గ్రామంలో గుండం ఉషారాణికి 80 వేల రూపాయల చెక్కును మరియు రోళ్లపాడు గ్రామంలో శంకరమ్మ కు 80 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.ఆస్పత్రిలో ఎన్నో లక్షల రూపాయల ఖర్చు పెట్టుకుని ఉన్నామని ఆ తరుణంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎమ్మెల్యేగా మీ సహకారం మాకు అందించారని మీ కృషి వల్లే మాకు ఇంత తొందరగా సీఎంఆర్ఎఫ్ నగదును మాకు అందజేయడం పట్ల సంతోషంగా ఉందని మరియు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు మరియు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.రోళ్లపాడులో సెల్ టవర్ గురించి పంచాయతీ కార్యదర్శి సుగుణావతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.గ్రామసభ తీర్మానం చేసి ఇవ్వాలని పీఎస్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎవరికి కూడా సెలవులు ఇవ్వడానికి వీల్లేదని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పలుచాని మహేశ్వర్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి,ఎంపీడీవో దశరథ రామయ్య,ఎస్ఐ ఓబులేష్,మాజీ సర్పంచ్ లు నాగ స్వామిరెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,నాగేంద్రుడు నాయకులు వంగాల రవికాంత్ రెడ్డి,సంపంగి రవీంద్రబాబు, రమణారెడ్డి,ఇద్రిస్,సుధాకర్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి, నరసింహ గౌడ్,షబ్బు పాల్గొన్నారు.