మిషన్ వాత్సల్య స్కీం లబ్ధిదారులతో ముఖాముఖి
1 min read
జిల్లా బాలల సంరక్షణ అధికారి స్వప్న ప్రియదర్శిణి..
నందికొట్కూరు న్యూస్ నేడు: మిషన్ వాత్సల్య స్కీం స్పాన్సర్షిప్ లబ్ధిదారులతో జిల్లా బాలల సంరక్షణ అధికారి స్వప్న ప్రియదర్శిణి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు.నంద్యాల జిల్లా ఐసిడిఎస్ నందికొట్కూర్ ప్రాజెక్టు పరిధిలోని నందికొట్కూరు, పగిడ్యాల,జూపాడుబంగ్లా,పాములపాడు కొత్తపల్లి,మిడుతూరు మండలాల పథకం లబ్ధిదారులతో ఈ కార్యక్రమం నందికొట్కూరు ప్రాజెక్ట్ ఆఫీసులో సిడిపిఓ మంగవల్లి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి స్వప్న ప్రియదర్శిని మాట్లాడుతూ మిషన్ వాత్సల్య స్కీం స్పాన్సర్షిప్ పథకం లబ్ధిదారులైన పిల్లలు వారి యొక్క చట్టాలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలని అలాగే జీవితంలో హక్కులు వినియోగించుకొని మంచి స్థాయికి ఎదగాలన్నారు. ముఖ్యంగా 18 ఏళ్లలోపు బాల బాలికలు వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కాల్ చేసి రక్షణ మరియు సంరక్షణ పొందాలని కోరారు.సంరక్షణ అధికారి దర్గయ్య మాట్లాడుతూ లబ్ధిదారులు వారి కోసం ఉన్న హక్కులు,చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అలాగే ఉన్నత లక్షణాలు ఎంచుకొని వాటిని నెరవేర్చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది,సూపర్వైజర్లు అంగన్వాడి సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.


