మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి – సిఐటియు
1 min readపల్లెవెలుగు వెబ్ డోన్: మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు కె.పెద్ద ఎల్లయ్య,ఎ.కుల్లాయప్ప డిమాండ్ చేశారు.ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు శనివారం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారిని వారి ఛాంబర్ లో కలిసి కార్మికుల సమస్యలపై చర్చించారు.సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు గత ప్రభుత్వ హయాంలో కార్మికులు చేసిన 16 రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కుదిరిన ఒప్పందాలకు వెంటనే జీవోలు విడుదల చేయాలని అందులో భాగంగా ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలను చెల్లించాలని అర్హత కలిగిన వాహన డ్రైవర్లకు రుా.24-500 రూపాయల వేతనం ఇవ్వాలని,సంక్రాంతి కానుక వేయి రూపాయలు ఇవ్వాలని,మరణించిన కార్మికుల కుటుంబాలకు 2,00,000 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని,పిఎఫ్ ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించి పకడ్బందీగా అమలు చేయాలని,అదే విధంగా మరణించిన కార్మికుల స్థానంలో మరియు రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను వెంటనే విధులలోకి తీసుకొని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు.రోజు రోజుకు పట్టణ విస్తీర్ణం పెరుగుతున్నదని అయితే దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్య మాత్రం పెరగడం లేదని ఉన్న కార్మికులతోనే పనులు చేయించడంతో కార్మికులు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని ఇప్పటికైనా కార్మికుల సంఖ్యను పెంచి శ్రమ దోపిడీని అరికట్టాలని సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ఉపాధ్యక్షుడు గోవిందు,చాపల రామాంజి, వెంకటలక్ష్మి,మా దక్క,రంగనాయకులమ్మ,పద్మావతమ్మతదితరులు పాల్గొన్నారు.