హైవే రహదారి పనుల జేసీ ఎమ్మెల్యే పరిశీలన..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పరిధిలోని హైవే రోడ్డు బ్రాహ్మణకొట్కూరు, దామగట్ల,10 బొల్లవరం, తంగడంచ,80 బన్నూరు తదితర గ్రామాల వైపున ఫోర్ లైన్ హైవే రహదారి పనులను శుక్రవారం నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గీత జయసూర్య పరిశీలించారు. తర్వాత వారు రైతులతో మాట్లాడారు.రైతుల పొలాలకు సంబంధించిన రైతులు వారి పొలాలకు వెళ్ళడానికి రస్తాలు లేవని పంట వేసుకోవడానికి మరియు పంట రవాణాకు చాలా ఇబ్బంది అవుతుందని ఎలాగైనా పరిష్కరించమని వారి సమస్యల గురించి రైతులు జాయింట్ కలెక్టర్.. ఎమ్మెల్యే మరియు నేషనల్ హైవే పీడీ పద్మజ దృష్టికి తీసుకెళ్లారు.మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని వీలైనంతగా రైతుల సమస్యలు నెరవేర్చే విధంగా చూస్తామని వారు రైతులకు హామీ ఇచ్చారు . అదే విధంగా ఎమ్మెల్యే హైవేకు సంబంధించి బ్రాహ్మణకొట్కూరు నుంచి పాములపాడు మండలం వరకు గల రైతుల పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా సర్వీస్ రోడ్డు మరియు అక్కడక్కడా అండర్ రోడ్లను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు.కలెక్టర్ దృష్టికి మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి,సర్వోత్తమ్ రెడ్డి, లక్ష్మీనారాయణ,ఖలీల్ బేగ్, పట్టణ కన్వీనర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.