జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు
1 min readవిద్యార్థులకు హాల్ టికెట్, ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేస్తే సహించేది లేదు
జిల్లా కలెక్టర్ కె. వెట్రీ సెల్వి ..ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయవలసిన నెంబర్ 9491041188
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లాలోని అన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజీ యాజమాన్యాలకు, ప్రిన్సిపాల్స్ కు తెలియజేయునది ఏమనగా విద్యార్ధులకు హాల్ టికెట్లు జారీ చేయుటలో, ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వడంలో, అధిక ఫీజులు వసూలు చేసినా అలాంటి ఫిర్యాదులు వచ్చినచో చట్ట రీత్యా అటువంటి కాలేజీ యాజమాన్యాల విషయంలో కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. అంతేగాక అటువంటి కళాశాలల గుర్తింపును రద్దు పరచబడునని తెలిపారు. జ్ఞానభూమి పోర్టల్ నందు దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్ధికి ఫీజు రియంబర్స్ మెంట్(ఆర్ టిఎఫ్) మరియు మెస్ చార్జీలు(ఎంటిఎఫ్) మంజూరు చేయబడునన్నారు. ఏలూరు జిల్లాలోని అన్ని కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్, విద్యార్ధులను వేధింపులకు గురిచేయకుండా, వారికి అవసరమైన హాల్ టికెట్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లు తక్షణమే ఇవ్వవలసినదిగా తెలిపారు. విద్యార్ధులకు తెలియజేయునది ఏమనగా ఏదైనా కలశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ మీకు హాల్ టెకెట్లు ఇవ్వకపోయినా అలాగే ఒరిజినల్ ధ్రువ పత్రాలు ఇవ్వకపోయినా, విద్యార్ధులు జిల్లా కలెక్టరు వారి గ్రీవెన్స్ సెల్ నెంబరు: 9491041188 కు ఫోన్ చేసి మీ ఫిర్యాధును తెలియపర్చవచ్చన్నారు.