PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫుట్బాల్ క్రీడాకారులకు “మెస్సి రోనాల్డో”ఆదర్శం.. మంత్రి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాలలో జరుగుతున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సి బి ఎస్ సి క్లస్టర్ సెవెన్ ఫుట్బాల్ పోటీలు మూడవరోజు జరుగుతున్నాయి .ఈ పోటీలు క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్నాయి. రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య  ఆధ్వర్యంలో జరుపబడుతున్న ఈనాటి క్వార్టర్ ఫైనల్ పోటీలకు రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రివర్యులు టిజి భరత్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు .వీరు క్రీడాకారులతో మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున నిర్వహింపబడుతున్న ఈ సీబీఎస్ఈ క్లస్టర్ ఫుట్బాల్ క్రీడా పోటీలకు మన కర్నూలు నగరంలోని రిడ్జ్ స్కూల్ వేదిక కావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు ఫుట్బాల్ క్రీడాకారులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రముఖ క్రీడాకారుడు మెస్సీ రోనాల్డ్ ఎంతో ఆదర్శం అన్నారు క్రీడల వల్ల దైనందిన జీవితంలో ఆరోగ్యంతో పాటు చక్కటి క్రమశిక్షణ అలబడుతుందన్నారు కేంద్ర క్రీడల మంత్రిచే మాట్లాడి మన కర్నూలు నగరంలో జాతీయస్థాయి వసతులతో కూడిన స్టేడియం నిర్మాణమునకు  రాష్ట్ర ప్రభుత్వము తరఫున నేను కృషి చేస్తానన్నారు. విద్యార్థులు చదువుకు, క్రీడలకు సమ ప్రాధాన్యతనిచ్చి బహుముఖ ప్రజ్ఞను చాటాలన్నారు. అనంతరం రవీంద్ర విద్యాసంస్థల ఛైర్మన్  జివిఎం మోహన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను, క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఒలంపిక్ క్రీడలు భారతదేశంలో నిర్వహించడానికి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ  దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి కూడా ఎందరో క్రీడాకారులు ఒలంపిక్ స్థాయి పోటీల ఎదుగుదలకు కారణం క్రీడామైదానాలు. కావున క్రీడా మైదానాలను ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలన్నారు గొప్ప క్రీడాకారులు కావాలంటే విద్యార్థి దశ నుండే పునాదులు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిడ్జ్ పాఠశాల సీఈవో జి.గోపీనాథ్, టోర్నమెంట్ కార్యదర్శి డీన్ రాజేంద్రన్, ప్రిన్సిపల్ రాజ్ కమల్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *