PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా. లక్ష్మణ్ ​ను కలిసిన డా. పార్థసారధి..

1 min read

ఆదోని, పల్లెవెలుగు:దేశ రాజధాని ఢిల్లీలో  బీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు , రాజ్యసభ సభ్యులు, బిజెపి పార్లమెంట్ బోర్డు సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ ను శుక్రవారం ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా. లక్ష్మణ్​కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం డా. పార్థసారధి రాజ్య సభ సభ్యులు డా. లక్ష్మణ్​ ఆశీర్వాదం తీసుకున్నారు.   బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన బీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి డా. పార్థసారధిని రాజ్యసభ సభ్యులు, బిజెపి పార్లమెంట్ బోర్డు సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్​ అభినందించారు.  ఆదోనిలో సుపరిపాలన చేసి మంచి పేరు ప్రతిష్టలు పొందాలని, మున్ముందు మరెన్నో పదవులు అలంకరించాలని ఆయన ఆకాంక్షించినట్లు డా. పార్థసారధి వెల్లడించారు.

About Author