PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని ఎన్.ఆర్ పేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పాల్గొన్నారు. ఎన్.ఆర్ పేటలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పెరిగిన పింఛన్లతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. సెలవు ఉంటే ఒక రోజు ముందే పింఛన్ పంపిణీ చేస్తామని అవ్వా తాతలకు భరోసా ఇచ్చామని మంత్రి టి.జి భరత్ చెప్పారు. ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను మంత్రి టి.జి భరత్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్ర బాబు, టిడిపి నేతలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *