వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆగాలి – న్యూఢిల్లీలో బిఎస్ఎస్
1 min readపల్లెవెలుగు వెబ్ ఢిల్లీ: విశాఖపట్నంలోని బంగాళాఖాతం తీరానగల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనలను మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, న్యూఢిల్లీ వారు తక్షణమే విరమించుకోవాలని ఢిల్లీలో గల కేంద్రమంత్రి హెచ్ డి కుమారస్వామి మరియు వారి బృందానికి ప్రత్యేకంగా విన్నవించింది. బి ఎస్ ఎస్ చీఫ్ హైకోర్టు న్యాయవాది కాకర్ల చంద్రశేఖర్, నేషనల్ కో కన్వీనర్ అడ్వకేట్ సునీల్ కుమార్, బిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అమరేష్ లు స్టీల్ ప్లాంట్ అథారిటీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్లాంటు ఉత్పత్తిని తక్షణమే పది మిలియన్ టన్నుల కెపాసిటీగా మారిస్తే, వైజాగ్ స్టీల్ ప్లాంటు లాభాల్లో వచ్చే అవకాశం మెండుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. వేలాది మంది రైతుల పంట పొలాలు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసమే త్యాగం చేశారన్నారు. ఉత్తరాంధ్రకు వాణిజ్య రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మరింత బలపడాలన్నా, కేంద్రం తక్షణమే జోక్యం చేసుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి శాతాన్ని 100 శాతానికి చేర్చితే, ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంటు లాభాల బాటలో నడుస్తుందని వారు కేంద్ర బృందాలని అభ్యర్థించడం జరిగింది.