నిర్మలమైన భక్తియే ముక్తికి త్రోవ…
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే
ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నిర్మలమైన భక్తియే ముక్తికి త్రోవ అని, అటువంటి నిర్మలమైన భక్తిని అలవరచుకోవాలంటే సత్పురుషుల సాంగత్యం అవసరమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ప్యాపిలి లోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీఈశ్వర స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోమాతతో, చిన్నారులతో శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణతో పురవీధుల గుండా అత్యంత కోలాహలంగా శోభాయాత్ర నిర్వహించారు. ఇందులో శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు ప్రదర్శించిన కోలాటాలు, ఘోష్, ఆనక్ , శంఖు వాయిద్యాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మూడు రోజుల పాటు శ్రీమద్రామాయణం, మహాభారతం భగవద్గీతలపై రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ తొగట సురేశ్ బాబు చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తితిదే ధర్మ ప్రచార మండలి సభ్యులు డాక్టర్ దేవి దయానంద సింగ్, ఆలయ కమిటీ నిర్వాహకులు కంచి నరేశ్, రాం ప్రతాప్, సరస్వతి విద్యాపీఠం కోశాధికారి యం. రామాంజనేయులు, వాల్మీకి సంఘం నాయకులు బంగి నాగరాజు, శరశ్చంద్ర నాథ్ సింగ్, రవీంద్ర నాథ్ సింగ్, వి. అశోక్ కుమార్, కె.లక్ష్మీ రంగయ్య, శిషుమందిర్ ప్రధాన ఆచార్యులు డి. రామాంజనేయులు, సహ ప్రధానాచార్యులు యం.వాసు, ఆచార్యులు శ్రీనివాసులు, రమణయ్య, పార్వతి, సరిత, చెక్కభజన, కోలాటం భజన గురువు డి.టి.నాగేంద్రతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.