శాతనకోటలో వరి పంట కోత ప్రయోగం-డీఏఓ మురళి కృష్ణ..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని శాతనకోట గ్రామంలో శనివారం రకం బీపీటీ 5204 రకంలో పంట కోత ప్రయోగం గురించి వరి పంట పొలాల్లో రైతులకునంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి వైవీ మురళీకృష్ణ మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు నందికొట్కూరు సి.విజయ శేఖర్ రైతులకు అవగాహన కల్పించారు.క్రాప్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అజ్మతుల్లా మరియు మండల వ్యవసాయ అధికారి పి.షేక్ షావలి,రైతు సేవా కేంద్రం సిబ్బంది మరియు రైతులు ఉన్నారు.ఈ పంట కోత ప్రయోగంలో 5–5 చదరపు మీటర్ల ఏరియాలో 21.77 కేజీలు వెయిట్ రావడం జరిగినది దీని ఆధారంగా ఎకరాకు 35.24 క్వింటాళ్ల వరి దిగుబడి వచ్చినది నిర్ధారించడం జరిగినది.తర్వాత గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో వరి పంటను వారు పరిశీలించారు.