PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాణ్యమైన మద్యాన్ని అందించేందుకు అధునాతన టెస్టింగ్ యంత్రాల ఏర్పాటు

1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ర్ట   ప్రభుత్వం అధునాతన టెస్టింగ్ యంత్రాల ద్వారా  పరీక్షలను నిర్వహించి నాణ్యమైన మద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.శనివారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కాంప్లెక్స్ లో ఉన్న రీజినల్ ఎక్సైజ్ లేబరేటరీని  కలెక్టర్ సందర్శించారు.. కొత్తగా వచ్చిన టెస్టింగ్ మిషినరీ,  ఇన్స్ట్రుమెంట్ ల ద్వారా లాబోరేటరిలో జరుగుతున్న అన్ని రకాల  పరీక్షలు, టెస్టింగ్ పద్ధతులు, రిపోర్ట్ లు పొందుపరిచే వివరాలు, పరికరాల పని తీరును  కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ప్రజలకు డిస్టిలరీస్ లో తయారయ్యే మద్యం నాణ్యతను, పరిమాణాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం గ్యాస్ క్రొమోటోగ్రఫీ, అటామిక్ అబ్జార్ప్షన్  స్పెక్ట్రోస్కోపీ (ఏఏఎస్) యంత్రాలను ఏర్పాటు చేసిందన్నారు..బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ యంత్రాల ద్వారా మద్యం నాణ్యతను,పరిమాణాన్ని పరీక్షించడం జరుగుతోందన్నారు.. హయ్యర్ ఆల్కహాల్స్, కాపర్, లెడ్ లాంటి లోహాలు పరిమితి లోపు ఉన్నాయా లేదా పరీక్షించి నాణ్యమైన మద్యం ను అందించడం జరుగుతోందన్నారు..నాణ్యమైన మద్యాన్ని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ తెలిపారు.అనంతరం కలెక్టర్  సహాయ కమీషనర్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు..అంతకుముందు సహాయ కమీషనర్ కార్యాలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ఎక్సైజ్  పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.జిల్లా కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు,ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, కెమికల్ ఎగ్జామినర్ హరిత, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *