శ్రీ శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి హుండీ ఆదాయం రూ.45,64,570/-లు
1 min read
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: జంగారెడ్డిగూడెం మండలము,గురవాయి గూడెం గ్రాములో వేంచేసి యున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము నందు హుండీలను తెరచి లెక్కించుట జరిగినది. సదరు లెక్కింపును సిహెచ్ ఉదయ్ కుమార్ బాబు, తనిఖిదారు, దేవదాయ ధర్మదాయ శాఖ, తాడేపల్లిగూడెం, మరియు లక్కవరం పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ భాస్కర్ వారి పర్యవేక్షణలో కే.వీ.బీ .బ్యాంక్ సిబ్బంది సమక్షమున హుండీలను తెరచి లెక్కించగా 51 రోజులకు గాను దేవస్థానము హుండీల ద్వారా రూ.43,77,549/-లు, అన్నదానం హుండీ ద్వారా రూ.1,87,021/- లు, వెరసి మొత్తం ఆదాయం రూ.45,64,570/- లు దేవస్థానమునకు సమకూరినది అని ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి చందన తెలియజేసినారు.