నగరవాటిక కొరకు స్థల పరిశీలన
1 min readఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
పల్లెవెలుగు వెబ్ ఆదోని: నగరవాటిక కొరకు స్థలం ఏర్పాటు చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదోని మండలం మండగిరి పంచాయతీ మరియు పరిసర ప్రాంతాల్లో అటవీ శాఖ, రెవెన్యూ, సర్వేయర్ సంబంధిత అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా ఆదోని పరిసర ప్రాంతాల్లో నగరవాటిక కు సంబంధించి అనువైన స్థల ప్రాంతాలను గుర్తించి స్థలం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదోని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శివ రాముడు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, అటవీశాఖ అధికారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.