PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రాలయం నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి

1 min read

గత 15 సంవత్సరాలుగా అభివృద్ధి లేని మా మంత్రాలయం నియోజకవర్గ సమస్యలను మీరే తీర్చాలి

అభివృద్ధి పదంలో నడిపించాలి

మంత్రాలయం తెదేపా ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి

పల్లెవెలుగు వెబ్  మంత్రాలయం:  మంత్రాలయం నియోజకవర్గం లో గత 15 సంవత్సరాలుగా అభివృద్ధి జరగలేదని మీరే మా నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడిపించాలని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని వినతి పత్రం అందజేశారు. మంగళవారం పత్తికొండ నియోజకవర్గం పుచ్చాకాయలమడ కు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి పుష్పగచ్చం అందచేసి ఘనస్వాగతం పలికినారు. ఈ సందర్భంగా మంత్రాలయంలో జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి అలాగే  వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని కోరారు. నియోజకవర్గంలో వలసలను నివారించి నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు నుంచి మూగలదొడ్డి, బసలదొడ్డి,మాధవరం, దుద్ది సంబంధించి 17454 ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టుల మోటర్ల మరమ్మతులు కోసం రూ 4.56కోట్లు కేటాయించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ, బిసి హాస్టళ్ల ను ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలని కోరారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు.  నాలుగు మండలాల్లో  కొత్త రోడ్లు, రోడ్ల మరమ్మతులు పనులు చేపట్టాలని కోరారు. మంత్రాలయంలో రాఘవేంద్ర పురంలో ఇబ్బందిగా ఉన్న 33 కేవి లైన్ ను మార్చడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కౌతాలం మండలం ఏరిగేరిలో జిల్లాపరిషత్ స్కూల్ లో ఇబ్బంది గా ఉన్న కేవి ని మార్చడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఏరిగేరి,కోసిగిలో, రాగిమాన్ దొడ్డిలో కొత్త కరెంటు సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి వివరించడం జరిగిందని తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత మినిస్టర్లకు అధికారులకు త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని  సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *