NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేరుకే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర!

1 min read

అయోధ్య నగర్‌లో పేరుకుపోయిన డ్రైనేజీ చెత్త.. దోమలతో ప్రజల అవస్థలు

ప్రచారం సరే.. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం ఏది?

హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద గ్రామంలోని అయోధ్య నగర్‌లో పారిశుద్ధ్య సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. సినిమా థియేటర్ సమీపంలోని డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని విమర్శిస్తున్నారు.

దోమల బెడదతో ప్రజల ఇబ్బందులు

డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త కారణంగా దోమల బెడద పెరిగిందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు.

ప్రచారం కాదు.. పరిష్కారం కావాలి!

స్వచ్ఛత కార్యక్రమాలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా గ్రామంలోని ప్రతి వీధిలో అమలు కావాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీలోని చెత్తను తొలగించాలని, క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు, పరిశుభ్రమైన పరిసరాలను అందించడం కూడా అధికారుల బాధ్యతేనని స్థానికులు పేర్కొంటున్నారు. అయోధ్య నగర్‌లో నెలకొన్న సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.

About Author