ఫ్లడ్ లైట్లతో పట్టణాన్ని తీర్చిదిద్దుతా..
1 min read-నాలుగేళ్లుగా నీటి బిల్లులెందుకు ఇవ్వలేదు వాటి వివరాలివ్వండి
-మెప్మాలో మార్పులు చేర్పులు చేయండి
-కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే
-కౌన్సిల్ కోసం అధికారులు పాత్రికేయుల నిరీక్షణ..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణాన్ని ఫ్లడ్ లైట్లతో మరియు డివైడర్లతో నందనవనంగా చేస్తానని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావలసిన పట్టణ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం 12:5 ని.కు ప్రారంభమై 1:10 కి ముగిసింది.మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అనివార్య కారణాల వల్ల రాకపోవడంతో వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ అధ్యక్షతన జరిగింది.రెండవ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ కాలనీలో సెల్ టవర్ రద్దు చేయాలని అదే విధంగా పశు పదశాలను వేరే చోటికి మార్చాలని అన్నారు.మా కాలనీలో గత ఎనిమిది నెలలుగా బోర్ నీళ్లే వస్తున్నాయి కానీ సమ్మర్ స్టోరేజ్ నీళ్లు రావడంలేదని కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి అన్నారు.పారిశుద్ధ్య కార్మికుల ఇంకా కావాలని అదేవిధంగా ఆత్మకూర్ నుండి కంపాక్టర్ తెప్పించాలని వైస్ చైర్మన్ రబ్బానీ అన్నారు.పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారు వారిని ఇబ్బంది పెట్టవద్దని కమిషనర్ బేబీ అన్నారు.క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 1 నుండి జనవరి 3 వరకు ఏబీఎం పాలెం,సీఎస్ఐ పాలెం, మారుతీ నగర్ కాలనీలో ప్రతిరోజూ దోమల ఫాగింగ్ పారిశుద్య పనులు చేపట్టాలని కౌన్సిలర్ చిన్నరాజు కోరగా ఆకాలనీల్లో రోజూ సిబ్బంది ఉండేలా చూడాలని ఎమ్మెల్యే మున్సిపాలిటీ కమిషనర్ బేబిని ఆదేశించారు.ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ పట్టణంలో కొత్త బస్టాండ్ నుండి ఆత్మకూరు రోడ్డు శ్లోక స్కూల్ వరకు డివైడర్లు మరియు ఫ్లడ్ లైట్లతో ఏర్పాటు చేస్తామని పట్టణంలో అవసరమైన అభివృద్ధి పనులకే ఆమోదం తెలుపుతున్నామని పట్టణంలో ఉన్న పొదుపు సంఘాల్లో పాత లీడర్లను తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించాలని మెప్మా అధికారి శాంతకుమారిని ఎమ్మెల్యే ఆదేశించారు.వైద్య సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందితో ఎమ్మెల్యే అన్నారు.2022 నుండి ఆర్డబ్ల్యూఎస్ నీటి బిల్లులు ఎందుకు కట్టలేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ పూర్తి వివరాలు నాకు ఇవ్వాలని కమిషనర్ ను ఆదేశించారు.కౌన్సిల్ సమావేశం కోసం అధికారులు మరియు పాత్రికేయులు నిరీక్షించాల్సి వచ్చింది.వైస్ చైర్మన్ ఏ ప్రశాంతి కౌన్సిల్ సమావేశానికి వచ్చి కాసేపు ఉండి వెళ్లారు.ఈ కౌన్సిల్ సమావేశానికి ఎంపీ వర్గం గైర్హాజర్ అయ్యారు.పట్టణ,రూరల్ సీఐలు ప్రవీణ్ కుమార్ రెడ్డి,సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.