PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళ ప్రాణాలు కాపాడిన వ్యక్తిని అభినందించిన జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మహిళ ప్రాణాలు కాపాడిన ఎమ్ . రాజేషన్ ను జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్ ఐపియస్     అభినందించి , నగదు రివార్డు అందజేశారు. ఈ సంధర్బంగా సోమవారం  జిల్లా ఎస్పీ  క్యాంపు కార్యాలయంలో సిపిఎం కొట్టాలకు  చెందిన ఎమ్. రాజేష్ ను, కర్నూలు ఒన్ టౌన్ కానిస్టేబుల్ కాశిం యాదవ్ ను శాలువతో సన్మానించి అభినందించారు. చాకచక్యంగా ,  సమయస్ఫూర్తిగా వ్యవహరించి మహిళ ప్రాణాలు  కాపాడడంతో జిల్లా ఎస్పీ  వారి సాహసాన్ని అభినందించారు.కెసి కెనాల్ లో వరద ప్రవాహం లెక్కచేయకుండా  సాహసోపేతంగా ఓ వ్యక్తిని కాపాడడం అభినందనీయమన్నారు.జరిగిన విషయం..కర్నూలు , కల్లూరు ఎస్టేట్ కు చెందిన జంగం నిర్మలమ్మ(50 సం.రాలు) కుటుంబ సమస్యలతో కెసి కెనాల్ లో దూకింది. నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుండగా సిపిఎం కొట్టాలకు  చెందిన ఎమ్. రాజేష్  కెనాల్ లో దూకి నిర్మలమ్మను కాపాడడం జరిగింది.నిర్మలమ్మను  వెంటనే కర్నూల్ ఒన్ టౌన్ పోలీసుస్టేషన్ కు చెందిన కానిస్టేబుల్  కాశిం యాదవ్  ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి మెరుగైన వైద్యం చేయించారు.  ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది.ఈ కార్యక్రమంలో కర్నూలు ఒకటవ పట్టణ సిఐ రామయ్యనాయుడు ఉన్నారు.

About Author