పింఛన్ల పంపిణీపై రాష్ర్ట ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ
1 min readపెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే, వెంటనే అతని భార్యకు వితంతు పింఛను మంజూరు
జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: NTR భరోసా పింఛను పథకం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీపై రాష్ర్ట ప్రభుత్వం కొన్ని నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.. ఈ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యాజమాని మరణిస్తే వెంటనే అతని భార్యకు వితంతు పింఛను మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కుటుంబ యజమాని మరణించిన వెంటనే అందుకు సంబంధించి తగిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తే, తదుపరి నెలలో అతని భార్యకు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.. ఈ ఉత్తర్వులు 01.11.2024 తేదీ తర్వాత మరణించిన వారికి మాత్రమే వర్తిస్తాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.అలాగే నూతన మార్గదర్శకాల ప్రకారం మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోయినా, 2వ నెలలో రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇస్తారని, ఒకవేళ రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా, మూడవ నెలలో మూడు నెలల పెన్షన్ మొత్తం కలిపి ఒకేసారి అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.. వరుసగా 3 నెలలు పింఛను తీసుకోకపోతే వారికి శాశ్వత వలసదారులుగా గుర్తించి ఆ పెన్షను నిలిపివేయడం జరుగుతుందన్నారు.. అయితే మూడు నెలలు పింఛను తీసుకోనివారు వారి పింఛను పునరుద్ధరించుట కొరకు Rollback సౌకర్యము ఉందని, అలాంటి వారు తగిన ఆధారముతో సచివాలయము WEA / WWDS / MPDO / కమిషనర్లను కార్యాలయాల్లో సంప్రదించి పింఛను పునరుద్ధరించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.