సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నాం
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పని చేస్తున్న ఉద్యోగులు 10 డిసెంబర్ 2024 నుండి తమ హక్కుల సాధనకై నిరవధిక సమ్మెను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారికి క్రమబద్ధీకరణ హామీ ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా సమస్యలపై చర్యలు తీసుకోకపోవడం నిరాశ కలిగించింది.సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ జీవనోపాధి, భద్రత, మరియు ఇతర హక్కుల కోసం ఈ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జేఏసీ నాయకులు పి. సాయిబేష్, కే. పంపావతి, ఎం. లక్ష్మప్ప, ఈ. రేణుక, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.