యూనియన్ పెన్షన్ స్కీమ్ ని వ్యతిరేకిస్తున్నాము….
1 min readఅఖిలభారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య
పల్లెవెలుగు వెబ్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని నిన్న జరిగిన అఖిలభారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏ ఐ పి టి ఎఫ్ జాతీయ సెక్రెటరీ జనరల్ కమలాకాంత్ త్రిపాటి ప్రకటించారు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు తమ సమాఖ్య దేశవ్యాప్తంగాపోరాటం చేస్తుందని వారు తెలియజేశారు. ఏ ఏ పి టి ఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం సెప్టెంబర్ 29 న జనక్‌పురి లో గల ఏఐపిటిఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి దేశంలోని 25 రాష్ట్ర ల ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరైనారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఆప్తా రాష్ట్ర అధ్యక్షులు ఏ జి ఎస్ గణపతి రావు హాజరైనారు. ఈ సమావేశంలో నూతన విద్యా విధానం లో మార్పులు చేయాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు .ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలలో కలపటం వల్ల గ్రామీణ మరియు కొండ ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమైనట్లు ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించామని వారు తెలియజేశారు.అలాగే జాతీయస్థాయిలో ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో మోడీ ముందుకు వెళ్తున్నారని అలాగే ఒకే దేశం. ఒకే పెన్షన్ విధానం అమలు చేయాలని , ఉద్యోగులకు ఒకరకమైన పెన్షన్ ఎంపీలకు ఎమ్మెల్యేలకు వేరే రకమైన పెన్షన్ విధానం ఇవ్వడం తగదని ఈ విషయంలో మోడీ ఉద్యోగులకు ఏ రకమైన పెన్షన్ ఇస్తే ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా అదే రకమైన పెన్షన్ ఇవ్వాలని ఈ సమావేశంలో కోరడం జరిగిందని పత్రికలకు తెలియజేశారు !