PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో వేడుక‌గా ప్రపంచ గుండె దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ హైద‌రాబాద్ : ప్రపంచ గుండె దినోత్సవాన్ని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఘ‌నంగా నిర్వహించారు. ప‌లువురు రోగులు, వైద్య నిపుణులు, ఇత‌రుల స‌మ‌క్షంలో నా గుండె, నా హ‌క్కు అనే థీమ్‌ను జ‌రుపుకొన్నారు. ఇటీవ‌లి కాలంలో గుండె క‌వాటాల వ్యాధులు పెరుగుతున్న నేప‌థ్యంలో గుండె ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం ప్రధానంగా గుర్తించింది. ఈ సంద‌ర్భంగా ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతీయ సీఈఓ దేవానంద్ కొలొతోడి మాట్లాడుతూ, ముంద‌స్తు గుండె వైద్య ప‌రీక్షలు త‌ప్పనిస‌రిగా చేయించుకోవాల్సిన అవ‌స‌రాన్ని నొక్కిచెప్పారు. ముఖ్యంగా పూర్తి ఆరోగ్యక‌రంగా ఉంటున్న యుక్తవ‌య‌స్కుల‌లోనూ గుండెపోటు కేసులు ఎక్కవ‌గా వ‌స్తున్న నేప‌థ్యంలో వీటి ప్రాధాన్యాన్ని తెలిపారు. గుండె క‌వాటాల ముప్పు కార‌కాల‌పై అవ‌గాహ‌న ఉండ‌ట్లేద‌ని,  చికిత్స ఫ‌లితాలు బాగుండాలంటే త్వర‌గా గుర్తించ‌డం, త‌గిన చికిత్స‌లు చేయ‌డం ముఖ్యమ‌ని చెప్పారు.ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో త‌గిన స‌మ‌యానికి పీటీసీఏ (పెర్‌క్యుటేనియ‌స్ ట్రాన్స్‌ల్యూమిన‌ల్ కొరొన‌రీ యాంజియోప్లాస్టీ), యాంజియోగ్రామ్ స్క్రీనింగులు చేయించుకున్న ప‌లువురు రోగుల వ్యక్తిగ‌త గాథ‌లు కూడా ఈ కార్యక్రమంలో వెలుగుచూశాయి. త‌మ జీవితాల‌ను ఈ చికిత్స‌లు ఎలా స‌మూలంగా మార్చాయో, స‌మ‌యానికి ఎలా చికిత్స చేయించుకోవాలో తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కార్డియాల‌జీ విభాగాధిప‌తి డాక్టర్ సాయి ర‌విశంక‌ర్ మాట్లాడుతూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డంలో జీవ‌న‌శైలి మార్పులు చేసుకోవాల్సిన ప్రాధాన్యాన్ని వివ‌రించారు. గుండె క‌వాటాల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తించి, రోగులుగా త‌మ హక్కులేంటో తెలుసుకోవాల‌ని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ప్రోత్సహించారు. గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే దిశ‌గా ప్రతి ఒక్కరూ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న సందేశాన్ని పున‌రుద్ఘాటించారు. త‌గిన పోష‌కాహారం ఎలా తీసుకోవ‌చ్చన్న విష‌యాన్ని ఆస్ప‌త్రికి చెందిన  డైటీషియ‌న్ వివ‌రించారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవ‌స‌ర‌మైన ఆహార మార్పుల‌పై అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారికి నిర్వహించిన‌ ఇంటరాక్టివ్ క్విజ్, గుండె ఆరోగ్యం విష‌యంలో వారి అవగాహనను మరింత పెంచింది. ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఆసుపత్రి నిబద్ధతను ప్రతిబింబిస్తూ చేసిన కేక్ కటింగ్, ఆరోగ్యకరమైన భోజనంతో వేడుక ముగిసింది.ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి గుండె ఆరోగ్యంపై అవగాహనను పెంపొందించడానికి తన అంకితభావాన్ని పునరుద్ఘాటించింది. సమాజంలో ఈ విష‌యం గురించి సంక్లిష్టమైన చ‌ర్చల‌ను పెంపొందించడం కొనసాగిస్తుంది. ఈ ఆసుపత్రి.. వ్యక్తులను వారి గుండెక‌వాటాల ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డానికి సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది, అందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తుంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *