ఒక్క ఓటుతో.. మహారాణి
1 min read – ఉత్కంఠ భరితం సాగిన బుక్కాపురం జీ.పీ. ఎన్నిక
– ఓటు తేడాతో గెలుపొందిన వరలక్ష్మి
ఒకే ఒక్క ఓటు.. ఆమె జాతకాన్నే మార్చేసింది… ఆ ఒక్క ఓటు.. ఎందరికో కనువిప్పు కలిగించింది. గెలుపోటములను నిర్దేశించేది.. ఆ ఒక్క ఓటేనని… అందరికీ తెలిసిన విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. వివరాలిలా ఉన్నాయి.
బుక్కాపురం గ్రామపంచాయతీ ఎన్నికలో కందుల వరలక్ష్మీ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలువగా… మారెడ్డి రామసుబ్బమ్మ రెబల్ అభ్యర్థిగా నిలిచారు. పోలీసు బందోబస్తు మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికలో మొత్తం 2096 ఓట్లు ఉండగా అందులో 1845 ఓట్లు పోల్ అయ్యాయి. 88.2 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో వరలక్ష్మీ 908 ఓట్లు సాధించగా.. రెబల్ అభ్యర్థి రామసుబ్బమ్మ 907 ఓట్లు సాధించింది. దీంతో ఒక్కే ఒక్క ఓటు తేడాతో వరలక్ష్మి ఘన విజయం సాధించింది.