ఏపీ ప్రభుత్వ పాఠశాల్లో `బైజూస్` ఆన్ లైన్ విద్య !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలు నేర్చుకునేందుకు వీలుగా ‘బైజూస్’ సంస్థతో ఏపీ సర్కారు ఒప్పందం చేసుకుంది. తెలుగు- ఇంగ్లీష్ మీడియంలో పాఠ్యాంశాలు సమగ్రంగా నేర్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏడాదికి రూ.20-24 వేలు చెల్లిస్తే కానీ లభించని బైజూస్ బోధన ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న పిల్లలను 2025 పదో తరగతి పరీక్షల నాటికి సుశిక్షితులను చేసేందుకు ఇంకొన్ని అడుగులు ముందుకువేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విద్యార్థులకు సిలబ్‌సతో పాటు అదనంగా ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. రాష్ట్రంలో 8వ తరగతి చదువుతున్న 4.7 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సీఎం వివరించారు. ఈ ఏడాది సెప్టెంబరులోనే ఈ ట్యాబ్‌లు అందిస్తామన్నారు.
✊️✊️✊️👌🙏🏻