ఇంతియాజ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం..
1 min readపార్టీలో విభేదాలు లేవు…
- కర్నూలు ఎంపీ అభ్యర్థి రామయ్య
కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న ఏ.ఎండి. ఇంతియాజ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు వైసీపీ ఎంపీ అభ్యర్థి బి.వై. రామయ్య. సోమవారం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఎస్వీ కాంప్లెక్స్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ 2019 మాదిరిగానే 2024లో కూడా కర్నూలు జిల్లాలో అన్ని చోట్ల వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని స్పష్టంచేశారు. ఆ తరువాత వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఎ.ఎండి. ఇంతియాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం.. అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయని ఆకాంక్షించారు. సమావేశంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
G shaik