చంద్రబాబు దిగ్భందనం
1 min readతిరుపతి; మాజీ ముఖ్యమంత్రి , తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడును తిరుపతి విమానాశ్రయంలో పోలీసులు దిగ్భందించారు. చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరులో పర్యటించేందుకు చంద్రబాబుకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు విమానాశ్రయంలోనే బైఠాయించారు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న తనను అడ్డుకోవడం ఏమిటని కోపోద్రిక్తులయ్యారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక పాలనకు ఇది ఉదాహరణ అన్నారు. రాష్ర్ర్టంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు. మరోవైపు విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు అడ్డగించిన నేపథ్యంలో .. తెలుగు దేశం కార్యకర్తలు విమానాశ్రయం వెలుపల ఆందోళన చేపట్టారు. చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకోవడం మీద తెలుగు దేశం నాయకులు తీవ్రంగా ఆగ్రహించారు. మరోవైపు చంద్రబాబు ను విమానాశ్రయం నుంచి తరలించేందుకు పోలీసులు ఆయనతో చర్చలు జరిపారు. అయినా కూడ చంద్రబాబు తన పట్టు వీడలేదు. చిత్తూరు జిల్లా పర్యటన చేసి తీరుతానని భీష్మించి కూర్చున్నారు.