పల్లెపోరు.. ప్రశాంతం..
1 min read– తుది విడత లో 78.41 శాతం పోలింగ్
– ఓటు హక్కు వినియోగించుకున్న 4,88,777 మంది
– అత్యధికంగా ఎమ్మిగనూరులో 81.62% .. అతి తక్కువగా కోసిగి మండలంలో 71.67 శాతం పోలింగ్
– నాలుగు విడతల జీపీ ఎన్నికల పోలింగ్లో 80.83 శాతం నమోదు
– ఓటు హక్కు వినియోగించుకున్న 15,12,023 మంది ఓటర్లు
– ఓటర్లు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె. పక్కీరప్ప
పల్లెవెలుగు, కర్నూలు బ్యూరో
కర్నూలు జిల్లాలో జరిగిన నాలుగు గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు బారులు తీరి ఓటింగ్ వేశారు . మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 82.14 శాతం, రెండో విడత 80.76% మూడో విడతలో 83.10% నమోదయ్యాయన్నారు. తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 14 మండలాల్లో 265 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరగగా అందులో మొత్తం 6,23,399 ఓటర్లు ఉండగా 4,88,777 మంది ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు వినియోగించు కోగా….78.41% పోలింగ్ నమోదయ్యాయన్నారు. నాల్గవ విడత ఎన్నికల ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ ఎన్నికల వార్ రూమ్/కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం 18,70,728 మంది ఓటర్లు ఉండగా అందులో 15,12,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడ గొడవ లేకుండా ప్రశాంతంగా పోలింగ్ ఎన్నికలు జరిగాయని అందుకు సహకరించిన ఓటర్లకు, అధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పోలింగ్లో పటిష్ట భద్రత
– ఎస్పీ కాగినెల్లి పక్కీరప్ప
అనంతరం ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప మాట్లాడుతూ నాలుగు గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశామని, చెదురుమొదరు ఘటనలు తప్పా.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ఓట్ల లెక్కింపులో అదనపు పోలీస్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ అయిన తర్వాత రాత్రి సమయంలో గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసు శాఖ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించి గట్టి బందోబస్తు నిఘా ఉంచామన్నారు. విజయోత్సవ సభలు, ఊరేగింపులు, సభలు, డప్పులు, బాణసంచా కాల్చడం నిషేధం..పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 అమల్లో ఉంటుందన్నారు. అతి సమస్యాత్మక ఏరియాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ జి. వీరపాండియన్