పోలింగ్‌కు సర్వం సిద్ధం
1 min readపల్లెవెలుగు, బనగానపల్లె ; రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని మండల ఎన్నికల అధికారి నాగప్రసాద్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రిని శుక్రవారం బనగానపల్లె ఎంపిడీఓ కార్యాలయంలో ఎంపిడివో నాగప్రసాద్, తహసీల్దార్ ఆల్ఫ్రెడ్, ఈవోఆర్డీ శివరామయ్య పర్యవేక్షణలో ఆయా గ్రామ ఎన్నికల సిబ్బందికి అందచేశారు. రెండవ విడత నామినేషన్ల పర్వం 8న, ప్రచార పర్వం గురువారం ముగిసిందని 13 వ తేదీన పోలింగ్ జరుగనుందని ఎంపిడివో తెలిపారు. బనగానపల్లె మండలంలో 24 గ్రామ పంచాయతీలకుగాను 10 పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు తెలిపారు. మిగతా 14 గ్రామ పంచాయితీలలో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఆయా పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్డులు 34 మంది పోటీలో ఉన్నారని అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 14 పంచాతీల్లో124 పోలింగ్ కేంద్రాల ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. మొత్తం శనివారం ఉదయం 6.30 నిమిషాల నుండి పోలింగ్ ప్రారంభమై 3.30లకు పోలింగ్ ముగుస్తుందని,సాయంత్రం 4గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారివారి పవిత్రమైన ఓటును వినియోగించుకోవాలని తెలిపారు.
మాట్లాడుతున్న ఎంపీడీఓ నాగప్రసాద్,